టీచర్ల ‘సర్దుబాటు’పై కొత్త మార్గదర్శకాలు

అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ‘పని సర్దుబాటు’ బదిలీలపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ విజయ్‌ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసు­కున్న తర్వాత నూతన మార్గదర్శకాలను రూపొందించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సర్దుబాటు ప్రక్రియను సోమవారం నుంచి ఈనెల 14వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇవీ మార్గదర్శకాలు..

» ఒకే సబ్జెక్టుకు సంబంధించి అన్ని మేనేజ్‌మెంట్‌ పాఠశాలల ఆధారంగా సబ్జెక్ట్‌ టీచర్లు (ఎస్‌ఏ), ఎస్‌జీటీలను సర్దుబాటు చేయాలి. మిగులు స్కూల్‌ అసిస్టెంట్లను ఇతర సబ్జెక్టుల ప్రకారం, వారి మెథడాలజీల మేరకు సర్దుబాటు చేయాలి
» అర్హత గల మిగులు ఎస్‌జీటీలు, సంబంధిత డిగ్రీ, బీఈడీ మెథడాలజీని ప్రామాణికంగా తీసుకుని ప్రీ హైస్కూల్, హైసూ్కల్స్‌లో సర్దుబాటు చేస్తారు
» ఒక స్కూల్‌లో ఒకటికంటే ఎక్కువ మంది ఎస్‌ఏ (పీడీ) లేదా పీఈటీ ఉన్నవారిని గుర్తించి అదనపు సిబ్బందిని లేని స్కూళ్లకు పంపిస్తారు
» ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్లకు సర్దుబాటులో ప్రాధాన్యం ఇస్తారు
» యూపీ స్కూల్స్‌లో ఎన్‌రోల్‌మెంట్‌ 98 కంటే తక్కువ ఉంటే 3 నుంచి 8 తరగతులు, 1 – 2 తర­గతులను విడివిడిగా వర్గీకరించి టీచర్లను సర్దుబాటు చేస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో పాత నిబంధనల ప్రకారమే సద్దుబాటు చేస్తారు.
» కొత్తగా మిగులు ఉపాధ్యాయులను గుర్తించినట్లయితే వారిని అవరోహణ క్రమంలో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో సర్దుబాటు చేస్తారు
» ఎస్‌ఏ (పీడీ), పీఈటీలను ఈ సేవలు లేని స్కూళ్లకు పంపిస్తారు

రెండు దశల్లో సర్దుబాటు
కొత్త నిబంధనల ప్రకారం రెండు దశల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ఉంటుంది. మొదటి దశలో మండలంలోని ఒకే మేనేజ్‌మెంట్‌ కింద ఉన్న స్కూళ్లకు, ఇంటర్‌ సబ్జెక్టుకు సంబంధించి అదే మండలానికి, మండల పరిధిలోని అర్హత కలిగిన అదే మండల పరిధిలోని స్కూళ్లలో సర్దుబాటు చేస్తారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :