పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. ‘OG’రిలీజ్ డేట్ ఫైనల్..?

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్(Pawan Kalyan), డైరెక్టర్ సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఓజీ’(OG) (ఓజాస్ గంభీరా)’. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అర్జున్ దాస్(Arjun Das), శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్(DVV Entertainment) బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘ఓజీ’ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ పవర్ స్టార్ అభిమానుల్లో అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. ఓజీ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించారంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :