విద్యాశాఖలో భారీగా ఉన్నతాధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. వివిధ విభాగాల డైరెక్టర్లు, అదనపు డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లతోపాటు సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్న కార్యదర్శులను సైతం మార్చనున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈవో), ఆర్జేడీలకు కూడా స్థానచలనం కల్పించనున్నారు. ఈ అంశంపై నెల రోజుల క్రితమే వివరాలు తీసుకున్న విద్యాశాఖ మంత్రి కార్యాలయం… అధికారుల మార్పుపై తుది ఫైల్‌ను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. సమగ్ర శిక్ష ఏఎస్పీడీగా ఉన్న శ్రీనివాసులరెడ్డిని పదో తరగతి పరీక్షల విభాగం (ఎస్‌ఎస్‌సీ బోర్డు) డైరెక్టర్‌గా బదిలీ చేస్తారని తెలిసింది.
Post Views: 16