సర్కారు చదువులు చతికిల!

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడి­పోయిందన్న చందంగా రాష్ట్రంలో విద్యా రంగం పరి­స్థితి తయారైంది. ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ఎన్ని అనర్థాలకు కారణమైందో చెప్పడానికి ప్రతి మండలంలో లెక్కలేనన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి. జిల్లా స్థాయిలో డీఈవో కార్యాలయం చేపట్టే సర్దుబాటు ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో నిర్వహించి, సవ్యంగా సాగుతున్న ప్రభుత్వ విద్యా వ్యవ­స్థలో ప్రభుత్వం గందరగోళం సృష్టించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :