ప్రస్తుత రోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డులు(Credit cards) వాడుతున్నారు. చేతిలో మనీ లేని సందర్భాల్లో ఈ కార్డులు ఉపయోగపడతాయి. కొనుగోళ్ల కోసం చాలా మంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. కానీ క్రెడిట్ కార్డుల్లో అనేక ఉపయోగకరమైన ఫీచర్స్ ఉంటాయని చాలా మందికి తెలిసుండదు. క్రెడిట్ కార్డులు కూడా పలు రకాల ఇన్సూరెన్స్‌లు ఇస్తాయి. పైగా ఎక్స్ట్రా ఛార్జీలు(Extra charges) కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. కార్డు హోల్డర్ కావడం వల్ల ఆటోమేటిట్గా ఈ ఇన్సూరెన్స్ సైతం కవర్ అవుతుంది. క్రెడిట్ కార్డు అందించే బీమా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వినియోగదారుడు కవరేజీకి సమానమైన మొత్తాన్ని పొందేలా చేస్తుంది.
సాధారణ క్రెడిట్ కార్డుల్లో అయితే ట్రిప్ క్యాన్సిల్ లేదా ఏదైనా అంతరాయం కలిగినట్లైతే.. నాన్ రిఫండబుల్(Non-refundable) ఖర్చులను రీయింబర్స్(Reimbursement)చేస్తుంది. ఉదాహరణకు అనారోగ్యం, తీవ్రమైన వాతావరణం. మీ ప్రయాణం గంటల్లో లేట్ అయితే వసతి భోజనం(Accommodation meals), రవాణా(transportation) వంటి ఖర్చులను కవర్ చేస్తుంది.