ప్రజెండ్ డేస్‌లో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు(Electric vehicles) కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా 2 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇష్టపడుతున్నారు. ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో ఏథర్ రిజ్టా(Aether Rizta) దూసుకెళుతోంది. చాలా మందికి ఇది ఫస్ట్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. కానీ మార్కెట్‌లో చాలా తక్కువ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో ఓ కొత్త ఎలక్ట్రిక్ మోడల్ స్కూటర్ మార్కెట్‌లోకి వచ్చింది. అదే రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 0-40 కిలోమీటర్ల వేగాన్ని 3.7 సెకన్లలో అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 80కేఎంపీహెచ్ ఉంటుంది. అంతేకాకుండా 2. 9 కిలో వాట్ల యూనిట్‌తో గొప్ప బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌ను కూడా అందిస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 159 కిలోమీటర్లు దూసుకుపోతుంది. ఈ స్కూటీ ఫ్రంట్ లో టెలిస్కోపిక్ ఫోర్కులు(Telescopic forks) ఉంటాయి. వెనక భాగంలో సింగిల్ షాక్ అబ్జార్బర్(Single shock absorber) లను కలిగి ఉంటుంది. ముందు భాగంలో డిస్క్. వెనక డ్రమ్ బ్రేక్ సెటప్(Drum brake setup) కూడా ఉంటుంది.