ఈ దేశాలకు వెళ్లేవారికి భారీ శుభవార్త..!!

పలు దేశాలకు వెళ్లినప్పుడు చేతిలో డబ్బు(money) తప్పనిసరిగా ఉండాలి. కానీ కొన్ని సమయాల్లో చేతిలో మనీ ఉండదు. చెల్లింపులు చేసేందుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాగా పక్క దేశాలకు వెళ్లేవారికి పేటీఎం(Paytm) శుభవార్త తెలిపింది. పేటీఎం వినియోగదారులకు కొత్త ఇంటర్నేషనల్ ఫీచర్(International feature) తీసుకొచ్చింది. మారిషస్(Mauritius), నేపాల్(Nepal), యూఏఈ(UAE), సింగపూర్(Singapore), భూటాన్(Bhutan), ఫ్రాన్స్(France) వంటి దేశాల్లో చెల్లింపులు చేసేందుకు కస్టమర్లకు అనుమతిస్తుంది. ఇండియన్ ప్రయాణికులు(Indian travelers) ఇప్పుడు ఈ యాప్‌ను యూస్ చేసుకోవచ్చు. డైనింగ్, షాపింగ్, స్థానిక అవసరాల కోసం మనీ పే చేయవచ్చు.

కానీ డిఫాల్ట్‌గా డిసేబుల్(Disabled default) చేసిన ఈ ఫీచర్‌(Feature)ను వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతా(Bank account)కు లింక్ చేయడానికి వన్ టైమ్ యాక్టివేషన్(One time activation) చేయాల్సి ఉంటుంది. యూపీఐ(UPI) ఆమోదించిన ప్రాంతాల్లో మాత్రమే ఈ ఫీచర్ యూస్ అవుతుంది. హాలీడేస్‌లో ట్రిప్(Trip) కు వెళ్తే.. ప్రయాణం మరింత సౌకర్యవంతంగా సాగుతుందన.. పేటీఎం వెల్లడించింది. ట్రిప్ వ్యవధిని బట్టి పేటీఎం వినియోగదారులు 1 నుంచి 90 రోజుల వినియోగ వ్యవధిని ఎంపిక చేసుకోవాలి. విదేశాల్లో షాపింగ్(Shopping), తినడం మొదలైన సేవలకు చెల్లించడానికి ఈ యాప్‌ను వాడుకోవచ్చు. నిర్ణీత సమయం అనంతరం ఆటోమేటిక్‌గా ఈ ఫీచర్‌ను క్లోజ్ చేస్తారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :