ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు: ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

 మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) నేతృత్వంతోని మహాయుతి కూటమి (Mahayuti Alliance) ప్రభంజనం సృష్టిస్తోంది. మొత్తం 288 సీట్లలో 200లకు పైగా స్థానాల్లో ఆ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 50 కంటే తక్కువ స్థానాల్లో కాంగ్రెస్ కూటమి (Congress Alliance) అభ్యర్థులు లీడింగ్‌లో ఉన్నారు. బీజేపీ (BJP)కూటమికి 50 శాతం పైగా ఓట్ షేర్ రాగా.. కాంగ్రెస్ (Congress) కూటమికి 42 శాతం ఓట్ షేర్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజా ఫలితాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (MP Sanjay Raut) సంచలన ఆరోపణలు చేశారు.

మహాయుతి కూటమి (Mahayuti Alliance) ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందని కామెంట్ చేశారు. అజిత్ పవార్ (Ajith Pawar), ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) చేసిన ద్రోహంపై మహారాష్ట్ర (Maharashtra) ప్రజలకు ఆగ్రహం ఉందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అఘాడీ కూటమికే మెజారిటీ సీట్లు వచ్చాయని.. ఇప్పడెలా ఫలితాలు మారాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ప్రజా తీర్పు కాదని.. ఈవీఎం (EVM)లను ట్యాంపరింగ్ (Tampering) చేసి గెలుస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర (Maharashtra)లో ప్రజాస్వామ్యం మరోసారి ఖూనీ అయిందని సంజయ్ రౌత్ అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :